NTV Telugu Site icon

Isro LVM3: కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న బాహుబలి రాకెట్‌ ఎల్వీఎం3..

Lvm3

Lvm3

Isro LVM3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(isro) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అర్థరాత్రి బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ శుక్రవారం అర్థరాత్రి 12.07గంటలకు ప్రారంభం కాగా.. శనివారం అర్థరాత్రి 12.07గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్‌ శాటి‌లైట్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ కంపెనీ వన్‌‌వె‌బ్‌కి చెందిన 36 బ్రాడ్‌‌బ్యాండ్‌ కమ్యూ‌ని‌కే‌షన్‌ శాటి‌లై‌ట్లను ఈ రాకెట్‌ ద్వారా ఇస్రో రోద‌సి‌లోకి పంప‌నుంది.

Secret Cameras: ఓయో గదుల్లో సీక్రెట్‌ కెమెరాలు.. రొమాంటిక్ వీడియోలు తీసి..!

మొత్తం 8 వేల కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రాకెట్‌.. రేపు 5,796 కేజీల బరువుతో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేలోని గ్రౌండ్‌ స్టేషన్‌ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాదాపు ఆరు టన్నుల బరువుతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్‌ రాకెట్‌గా గుర్తింపు పొందనుంది. తొలి కమర్షియల్‌ మిషన్‌గా, తొలి మల్టీ శాటిలైట్‌ మిషన్‌గా కూడా ఈ ప్రయోగం చరిత్రలో నిలిచిపోనుంది. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్‌ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది.