NTV Telugu Site icon

Sudan : ప్రపంచాన్ని భయపెడుతున్న సూడాన్.. ఆ దేశ ల్యాబ్‎లో ఏం జరుగుతోంది ?

War Copy

War Copy

Sudan : చైనా సృష్టించిన కరోనా మహమ్మారి పుణ్యమా అన్ని ప్రపంచమే తలకిందులైంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి అన్ని దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. కొన్నాళ్లుగా కోవిద్ కేసులు తగ్గుతూ పెరుగుతున్న పెద్దగా వాటి గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు. 2020లో కోవిద్ నాటి పరిస్థితులను మరొక్క సారి గుర్తు తెచ్చుకోవాల్సి వస్తోందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి.. కారణం సూడాన్ దేశం. సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆర్మీ జనరల్ అబ్దెల్-ఫత్తా బుర్హాన్, ఆర్‌ఎస్‌ఎఫ్ చీఫ్ జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య రెండు వర్గాల మధ్య పోరు జరుగుతోంది. ఈ పోరు కారణంగా సూడాన్ పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆసుపత్రులు మూత బడ్డాయి. ఇంతలో, ఈ యోధులు దేశంలోని అతిపెద్ద పబ్లిక్ ల్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని కారణంగానే ప్రపంచం మొత్తం భయపడుతోంది.

Read Also:Minister Mallareddy: ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు

ఈ సెంట్రల్ ల్యాబ్ లో ట్టు, పోలియో, కలరా వంటి ప్రాణాంతక వ్యాధుల నమూనాలను ఉంచుతారు. ఈ శాంపిల్స్‌లో కొంచెం ట్యాంపరింగ్ జరిగినా ప్రపంచంలో భారీ వ్యాధుల బాంబ్ పేలుతుంది. అప్పుడు ప్రజలంతా ఈ వ్యాధుల భారిన పడతారిని డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించింది. పోలియో, మీజిల్స్‌తో సహా వ్యాధుల నమూనాలను కలిగి ఉన్న సూడాన్‌లోని జాతీయ పబ్లిక్ లాబొరేటరీని ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారని, ఇది “అత్యంత ప్రమాదకరమైన” పరిస్థితిని సృష్టిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. “ఫైటర్లు అందులో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులందరినీ ల్యాబ్ నుండి తరిమివేశారు. ప్రస్తుతం ల్యాబ్ ఫైటర్ల నియంత్రణలో ఉంది” అని సూడాన్‌లోని డబ్ల్యూ హెచ్ వో ప్రతినిధి నిమా సయీద్ అబిద్ తెలిపారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఈ వ్యాధుల ఐసోటోప్ వ్యాపిస్తుంది. అది ప్రపంచానికే ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఇక్కడ కరెంటు లేకపోవడం, ల్యాబ్ ను సరిగా నిర్వహించకుంటే లీకేజీలక ఛాన్స్ ఉందంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ ల్యాబ్ ‘బాక్టీరియా బాంబ్’గా మారుతుంది. ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది.

Read Also:Delhi: అమానుషం.. వ్యక్తిని కారుతో గుద్ది బ్యానెట్ పై 3కి.మీ లాక్కెళ్లిన ఎంపీ డ్రైవర్