Tummala Nageswara Rao : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఆయన ఈ రోజు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పత్తి సేకరణ కోసం సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే, ప్రతి జిన్నింగ్ మిల్లు నోటిఫై చేసిన విధంగా పనిచేయాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం తగ్గించే విషయంలో సీసీఐ సీఎండీతో చర్చించామని, వ్యవసాయం సంబంధిత సమస్యలు ఉంటే రైతులు వాట్సాప్ నెంబర్ 8897281111 ద్వారా స్పందించాలని సూచించారు. మరోవైపు, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు వస్తే, కలెక్టర్లు , మార్కెటింగ్ అధికారులు వాటిని త్వరగా పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.
Andhra Pradesh: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ