NTV Telugu Site icon

Costly Cow: దేవుడా.. వేలంలో 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు..!

7

7

భారతదేశంలో అనేక రకాల మేలు రకపు జాతులకు చెందిన ఆవులు లభ్యం అవుతాయి. అందులో మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని మేలు రకానికి సంబంధించిన ఆవులు ప్రసిద్ధిగాంచినవి. ఇకపోతే., తాజాగా భారతదేశానికి సంబంధించిన ఆవు ప్రపంచంలోనే అత్యంత ధరకు అమ్ముడుపోయింది. ఏకంగా భారత సంతతికి సంబంధం ఉన్న ఆవు 40 కోట్ల రూపాయలకు అమ్ముడబోయింది. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..

Also read: Election Rules: ఇంటింటి ప్రచారానికి అనుమతి తప్పనిసరి చేసిన ఎన్నికల సంఘం.. నిబంధనలపై పార్టీల అసంతృప్తి..!

భారతదేశానికి చెందిన మేలురకపు జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది. వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవిస్ జాతి అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది. ఇది మన కరెన్సీలో 40 కోట్ల రూపాయలకు సమానం. ప్రస్తుతం 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఆవు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన మేలురకపు ఆవు. అయితే ఈ రకపు ఆవు 1868 లోనే బ్రెజిల్ కి రవాణా చేయబడింది. ఆ తర్వాత ఈ రకపు జాతి ఆవులు ప్రపంచంలో ప్రఖ్యాతి చెందాయి. ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండికస్.

Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి..

ఇక ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోని 16 మిలియన్లు ఉన్నాయంటే ఎంత ప్రాముఖ్యత చెందాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇవి చూడడానికి తెల్లగా.. అలాగే భుజాలపై పెద్దగా ఉబ్బెత్తుగా మూపురం కలిగి ఉంటాయి. ఈ జాతి ఆవులు వేడి ప్రాంతాలకి సులభంగా అనుకూలిస్తాయి. ఇందులో వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.