NTV Telugu Site icon

Corpses Festival: ఇదెక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం.. శవాలతో పండగ ఏంట్రా బాబు

Corpses Festival

Corpses Festival

Corpses Festival: ప్రపంచంలో వివిధ ఆచారాలు, అనేక సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఒక ఆచారం గురించి చెబితే ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారం అంటారు. అదే శవాలతో పండుగ. అదేంటి శవాలనతో పండు ఏంట్రా బాబు అంటారా. అవును మీరు విన్నది నిజమే.. వారు అక్కడే పాతిపెట్టిన శవాలను బయటకు తీసి, దానిని అందంగా అలంకరించి, వాళ్లు బతుకున్నప్పుడు ఏమేమి చేసేవారు అంటే.. ఇష్టంగా ఏం తినేవారో.. ఎలా తయారు అయ్యేవారో.. అచ్చం అలాగే వంటలు చేసి, అందంగా ముస్తాబు చేసి ఆ శవాన్ని పూజించి చేస్తారు. ఇలాంటి ఆచారం చూడాలంటే డైరెక్ట్ గా ఇండోనేసియా వెళితే మీరు స్వయంగా చూడొచ్చు. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు చనిపోయిన వారిని.. సమాధి నుంచి బయటకు తీసి, స్నానం చేయించి, పండుగలా జరుపుకునే సంప్రదాయాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అయితే ఆ వేడుక ఇంకా ఇప్పటికి కొనసాగుతోందనే ఉండటం గమనార్హం. ఈ వేడుకను మనెనే పండుగ అంటారు.

Read also: Chattisgarh : మనీ హీస్ట్ వెబ్ సిరీస్‌ని చూసి డ్రగ్స్ స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్

దక్షిణ ఇండోనేషియాలోని సులవేసిలోని తోరాజా సంఘం ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అంటే చనిపోయిన వారు ఇంకా బతికే ఉన్నారనే నమ్మకం. అందుకే వారి సంవత్సరికం పాతిపెట్టిన శవాలను బయటకు తీసి ఆ రోజున పండుగ చేసుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకను మనెనే అంటారు. ఆ రోజు అంటే సమాధుల నుండి శవాలను బయటకు తీసి శుభ్రం చేసే పండుగ. ఈ వేడుకలకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శవాన్ని గుంతలోంచి బయటకు తీసి స్నానం చేయిస్తారు. ఆ శవానికి అంటుకున్న కీటకాలు, మురికిని జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు ధరించి, సమాధులను శుభ్రం చేస్తారు. మృతదేహాలను శుభ్రం చేసిన తర్వాత వారి పట్ల తమకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తారు. వాటిని అందంగా అలంకరింస్తారు. పురాతన ఆచారాలను అనుసరించడంతో పాటు టోరోజా ప్రజలు సంబంధాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి వేల సంఖ్యలో ఆ పండుగకు కలిసి వస్తారు. టోరోజా ప్రజలు కొనసాగిస్తున్న ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.

Read also: Gold Price Today : దిగొచ్చిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. తులం ఎంతంటే?

బంధుమిత్రులు జీవించి ఉన్నప్పుడే వారి గౌరవాన్ని, ప్రేమను, ఆప్యాయతలను కాపాడుకుంటూ మరణించిన తర్వాత కూడా బంధువులను జరుపుకునే ఆచారాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తారు. ఇది విచిత్రమైన సంప్రదాయం అయినప్పటికీ, టోరోజా ప్రజల మతపరమైన ఆచారం నిజంగా అద్భుతమైనదని పర్యాటకు చెబుతున్నారు. చూసేందుకు, వినేందుకు భయంగా అనిపించినా టోకరా ప్రజలు పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తందని, ఇప్పటి వరకు వారు అనుసరిస్తున్నట్లు తెలిపారు. వారికి ఆ పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుందని అంటున్నారు. మరణం అంతం కాదు. దేనికీ అంతం లేదు, అది శాశ్వతమని నమ్ముతారు. చనిపోవడం అంటే టోరోజా ప్రజలు గాయపడినట్లు భావిస్తారు. దీని కోసం టోరోజా ప్రజలు దీనిని మకులా అని పిలుస్తారు. అంటే గాయపడిన వ్యక్తి చనిపోయినా, ఆ వ్యక్తిని బతికున్నట్లుగానే వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో, టోరోజా ప్రజలు వసంత మాసం చివరిలో మనెనే పండుగను జరుపుకుంటారు.
Double ismart : ఉస్తాద్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్..దిమాక్ కిరి కిరి టీజర్ వచ్చేసింది..