NTV Telugu Site icon

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు హాజరైన కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు

Kaleshwaram Kamission

Kaleshwaram Kamission

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ హరి భూషణ్ శర్మను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, కాలేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది? సిబ్బంది ఉద్యోగుల జీతాలు ఎవరి చెల్లించారు అని ప్రశ్నించింది కమిషన్‌. కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంక్ లలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు వెంకట అప్పారావు చెప్పారు. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బులను కాలేశ్వరం కార్పొరేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడినట్లు అధికారి తెలుపగా.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి… లోన్స్ నుంచి వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారు అని అధికారులను ప్రశ్నించింది కమిషన్.

Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శన‌పై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!

అంతేకాకుండా.. కాళేశ్వరం కమిషన్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు, డిప్యూటేషన్ పై వచ్చి మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్లు అప్పారావు తెలిపారు. కొంతకాలం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాటినుంచి వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులు ద్వారా మెయింటినెన్స్ చేసినట్లు కమిషన్‌ చెప్పారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా అని, లోన్లు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు అని కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించింది కమిషన్. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు అప్రూవల్ తర్వాత లోన్లు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ కు లోన్లు తీసుకున్న తర్వాత ఏమైనా అసెట్స్ వచ్చాయా అని కమిషన్‌ ప్రశ్నించగా.. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎలాంటి ఆదాయం లేదని అసెట్స్ లేవని అధికారులు కమిషన్‌కు తెలిపారు. బిల్లులు ఎలా చెల్లించేవారు ఎవరి ఆదేశాల మేరకు చెల్లించారు అని అకౌంట్స్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. చెల్లించిన బిల్లుల వివరాలను ఆన్లైన్లో పెట్టారా అని కమిషన్ చీఫ్ చంద్ర గోష్ ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని కమిషన్ ముందు అధికారులు చెప్పారు.. అయితే.. కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను పదేపదే కమిషన్ చీఫ్ చంద్ర గోష్ అడిగినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయం పై చెప్పిన కాగ్ నివేదికతో అంగీకరిస్తారని ప్రశ్నించింది కమిషన్. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని తమ అభిప్రాయం అకౌంట్స్ అధికారులు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్ కి ఎవరు బాధ్యత వహిస్తారని కమిషన్ ప్రశ్నించగా.. ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్ బాధ్యత విషయం పై స్పందించలేమంటూ చెప్పిన అకౌంట్స్ అధికారులు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు జనరల్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి. కమిషన్ అడిగే ప్రశ్నలకు నా పరిధి కాదు, నేను చెప్పలేను అంటూ మౌనం పాటించిన పద్మావతి.

Prajavani : గాంధీ భవన్‌లో మొదటి రోజు ముగిసిన ముఖాముఖి