NTV Telugu Site icon

Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ

Coronavirus Cases

Coronavirus Cases

Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ… ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్‌ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. హెల్త్ ను రాజకీయ అంశంగా చూడొద్దు’ అని అన్నారు.

Also Read: Poco M6 5G Launch: డిసెంబర్ 22 న పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్!

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్‌-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్‌-1 ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది.

Show comments