గత 2020 నుంచి చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికించింది.. వైద్య శాస్త్రానికే సవాల్ విసిరింది. అదే కోవిడ్… మళ్ళీ కరోనా వ్యాపిస్తోందా? కొత్త వేరియంట్లు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా కరోనా కొత్త సబ్ వేరియంట్స్ దడ పుట్టిస్తున్నాయి. 11 రోజుల్లో 11 ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త రకం కోవిడ్ వేరియంట్ లక్షణాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పటివరకు ఉన్న లక్షణాలకు తోడు మరో లక్షణం నమోదైంది. కోవిడ్-19 XBB.1.5 వేరియంట్ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్
భారతదేశంలో మొత్తం XBB.1.5వేరియంట్ కేసుల సంఖ్య తాజాగా ఏడుకి పెరిగింది. అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసులకు XBB.1.5వేరియంట్ కారణమని కనుగొన్నారు. కోవిడ్-19,XBB.1.5 వేరియంట్ కేసులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో నమోదవడం అంతా అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమయింది. గుజరాత్‌లో మూడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే… కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో కరోనా వీరవిహారం చేస్తోంది. అక్కడి జనాభాలో 64 శాతం మందికి కరోనా వైరస్ సోకింది. ఈ నెల 11 నాటికి 90 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారని పెకింగ్ వర్శిటీ వెల్లడించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాలో రద్దీగా ఉండే గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కోవిడ్ సోకింది. యునాన్ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ గురించి చెబితేనే అక్కడి జనం వణికిపోతున్నారు. ఈ నెల 23న చైనా కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో వున్న లక్షలాది మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీ పెరిగే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేవారిపై ఆంక్షలు విధిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Delhi Firing: బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం