Site icon NTV Telugu

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ.. జీఓ 9, 41, 42 ల పై స్టే

Tg High Court Jobs

Tg High Court Jobs

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. జీఓ 9, 41, 42 ల పై హైకోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.

Also Read:AP Fake Liquor Case: జనార్దన్‌ రావు అరెస్టు చూపకపోతే హైకోర్టులో పిటిషన్ వేస్తాం!

హైకోర్టు తీర్పుతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలపై జారీ చేసిన గెజిట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు సెప్టెంబర్‌ 29న విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Exit mobile version