NTV Telugu Site icon

Police: సారా కావాలన్న ఖైదీ.. సంస్కారంగా ఇప్పించిన పోలీస్

New Project (1)

New Project (1)

Police : ఓ కేసు విషయంలో అరెస్టైన ఖైదీ పోలీసు సాయంతో వైన్ షాపులో లిక్కర్ కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతనో ఖైదీ.. ఓ కేసులో కోర్టు హియరింగ్ కు తీసుకెళ్తుండగా అతడికి వైన్ షాప్ కనిపించింది. దీంతో తనను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసును బతిమాలాడు. సార్ మందు కావాలని వేడుకున్నాడు. దీంతో సార్ సరే అన్నాడు. చేతులకు సంకెళ్లతోనే వైన్ షాపుకెళ్లి ఓ మందు సీసా కొన్నాడు. ఇంత వరకు అంతా బాగానే నటించాడు. కానీ ఆ సీన్ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ సారు గారిపై వేటు పడింది.

Read Also:JC Prabhakar Reddy: చొక్కా విప్పి జేసీ హల్‌చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్

ఇది ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగింది. ఒక కేసులో సీఆర్పీసీ సెక్షన్ 151 కింద అరెస్టై జైలులో ఉన్న వ్యక్తిని కోర్టు విచారణ నిమిత్తం పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సంకెళ్లతో ఉన్న ఆ ఖైదీ మార్గమధ్యలో మద్యం షాపు వద్ద లిక్కర్‌ కొన్నాడు. అతని వెంట ఉన్న పోలీస్‌ దీనికి సహకరించాడు. అటుగా వెళ్తున్న వారు మొబైల్‌ ఫోన్‌లో దీనిని చిత్రీకరించాడు. దీంతో ఈ వీడియో క్లిప్‌తో పాటు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయ్యారు. ఘటనపై స్పందించిన హమీర్ పూర్ జిల్లా ఎస్పీ.. పోలీసులు వెంట ఉండగానే ఖైదీ లిక్కర్ కొనుగోలు చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖైదీ వెంట ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

Read Also:Sreya sran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్‌

Show comments