JC Prabhakar Reddy: చొక్కా విప్పి జేసీ హల్‌చల్..కేతిరెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేసీ ప్రభాకర్ రెడ్డి.. అనంతపురం జిల్లాలో ఆయనో స్పెషల్.. మాజీ ఎమ్మెల్యేగానే కాదు ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ఆయన అందరికీ చిరపరిచితుడు. అధికార పార్టీపై ఆయన విమర్శలు చేస్తుంటారు. సమస్యలపై పోరాటం చేస్తారు. ఆయన తన ఆఫీసులోనే నిరసన వ్యక్తం చేస్తారు. మునిసిపల్ ఆఫీసులోనే స్నానాలు చేశారు. మునిసిపల్ కమీషనర్ అవినీతిపై ధ్వజమెత్తారు. ఇవ్వాళ మరో అడుగు ముందుకేశారు. అర్ధనగ్న ప్రదర్శన ఇచ్చారు. చొక్కా విప్పి హల్‌చల్ చేశారు. అక్కడితో ఆగలేదు- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్లెక్సీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి- జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
Read Also: Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
ఇసుక అక్రమ రవాణా, మున్సిపాలిటీలో డీజిల్ దుర్వినియోగం వంటి అంశాల మీద ఈ ఇద్దరు నేతల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంది. అదికాస్తా ఫ్లెక్సీలపైకీ ఎక్కింది. తాడిపత్రి మున్సిపాలిటీలో డీజిల్‌ను ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టానుసారంగా, తన సొంత అవసరాల కోసం వాడుకుంటున్నాడంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు.
అయితే అసలు డీజిల్ దొంగ ఎవరో తేలాలంటున్నారు జేసీ. తాడిపత్రి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న డీజిల్ వినియోగానికి సంబంధించిన లెక్కలను వివరిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల వద్ద తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి హల్‌చల్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గజదొంగగా అభివర్ణించారు. ఈ ఫ్లెక్సీల్లో ప్రచురించిన సమాచారం అంతా అబద్ధమంటూ ధ్వజమెత్తారు. కావాలంటే మున్సిపాలిటీ లెక్కలను బయటికి తీసి, ప్రజల ముందు పెడతానని సవాల్ విసిరారు.అంతేకాదు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. తాను ప్రజల మనసు దోచుకున్న దొంగను అంటూ చొక్కా విప్పి మరీ ప్రదర్శించారు. తాడిపత్రి అని రాసివున్న పేపర్‌ను గుండె ఆకారంలో కత్తిరించి, దాన్ని తన కడుపుపై అతికించుకున్నారు. మొత్తం మీద జేసీ-పెద్దారెడ్డిల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో చూడాలి. ప్రభాకర్ రెడ్డి ఫ్లయింగ్ కిస్ లు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
Read Also: Sreya sran: నన్ను అడగడం కాదు.. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? శ్రియ సీరియస్
- Tags
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..