Site icon NTV Telugu

Viral : కూలర్ కోసం కుస్తీ.. పెళ్లిలో కొట్టుకున్న వధూవరుల బంధువులు..!

Fight In Marriage

Fight In Marriage

Viral : పెళ్లంటే పండుగ, పరవశం, రెండు హృదయాల కలయిక.. కానీ ఒక్క కూలర్ కారణంగా పెళ్లి మ్యారేజ్‌ మూడ్ మొత్తం రచ్చగా మారిందంటే నమ్ముతారా..? ఇదే జరిగింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఓ పెళ్లిలో..! వధూవరుల తరపున కుటుంబ సభ్యుల మధ్య ఏవో చిన్నపాటి మాటల తేడాలు జరగడం సాధారణమే. కానీ ఇక్కడ విషయంలో తెరపైకి వచ్చినది – కూలర్!

అవును, పెళ్లి మండపంలో వధూవరుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూలర్ చుట్టూ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. వరుడు వైపు నుంచి వచ్చిన కొందరు అతిథులు కూలర్‌ ముందు కూర్చొనడంతో, గాలి అడ్డవడంతో వధువు కుటుంబం అసహనం వ్యక్తం చేసింది.

Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కలెక్టర్ అంబేద్కర్‌ ఫైర్..

ఈ సాదాసీదా మాటా మాటా పెరిగి చివరికి పెద్ద హంగామాకు దారి తీసింది. ఇద్దరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం కాస్తా కుర్చీలు, పాత్రలతో తలగడలాటగా మారింది..! ఈ దృశ్యాలు వీడియో రూపంలో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. @gharkekalesh అనే అకౌంట్‌ నుంచి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 60,000కిపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఒకరు.. “ఉత్తర భారతీయులు ఎలాంటి అవకాశం వదులుకోరు” అంటూ వ్యాఖ్యానించగా, మరొకరు “ఇలాంటి పెళ్లిళ్లు ఎక్కువగా గొడవలతోనే ముగుస్తాయా?” అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకొంతమంది అయితే “వధూవరుల తల్లిదండ్రులు ఎంత గాఢంగా ఈ రోజు కోసం ఎదురు చూసుంటారు, కనీసం వాళ్ల గురించైనా ఆలోచించాల్సింది” అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన మిగతా అతిథులకు మాత్రం ఒక అరుదైన ‘పెళ్లి సందడి’ అనిపించి ఉండొచ్చు..!

Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన మరో స్టార్ ప్లేయర్..!

Exit mobile version