తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కోసం కాన్యాయ్ ని సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసింది. ప్రాథమికంగా వైట్ కలర్ కాన్యాయ్ ను అధికారులు రెడీ చేశారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ కి 6 ఇన్నోవా కార్లు వచ్చి చేరుకున్నాయి. రెండు కొత్త కార్లు ఉండగా మిగతా 4 కార్లు ఇప్పటికే నెంబర్ ప్లేట్ అలాట్ అయినవి ఉన్నాయి. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత కొత్త కాన్యాయ్ లో సీఎం ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, బాధ్యతలు చేపట్టిన కొత్త ముఖ్యమంత్రి.. తన అభీష్టం మేరకు కాన్యాయ్ ను మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది.
ఇక, మరో వైపు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. మంత్రి వర్గ సిఫార్స్ మేరకు సెకండ్ అసెంబ్లీని క్యాన్సిల్ చేశారు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి సాంకేతికపరమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే పార్టీ హైకమాండ్ మొగ్గుచూపుతుంది.. ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పార్టీలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎల్లా హోటల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు మరో నలుగురు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కూడా ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాత.. సీఎం అభ్యర్థి పేరును రేపు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.
తెలంగాణ కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్#Telangana #NewCM #CMconvey #Congress #BhattiVikramarka #Revanthreddy #NTVNews #NTVTelugu pic.twitter.com/CZQ6jNOvms
— NTV Telugu (@NtvTeluguLive) December 4, 2023