Contract Employees Regularisation Guidelines Released in Andhrapradesh: కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 15 వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి లోపు రెగ్యులరైజేషన్ పూర్తికి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కారు.
సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Read Also: Minister Amarnath: పవన్ అజ్ఞాత వాసి, నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి.. మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం