Site icon NTV Telugu

Content Over Budget: బడ్జెట్ కాదు భయ్యా.. కంటెంట్ ముఖ్యమంటున్న సినీ అభిమానులు!

Movies

Movies

Content Over Budget: ప్రతివారం వీకెండ్ వచ్చిందా సరి.. సినీ ప్రెకషకులను అలరించేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రేక్షకులను ఎంటెర్టైమెంట్ చేయడానికి తెగ కష్టపడున్నారు సినీ మేకర్స్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సినిమాలు విడుదలవుతున్న.. కలెక్షన్స్ మాత్రం చాలా కొద్దీ సినిమాలే సాధిస్తున్నాయి. నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ తో పని లేకుండా.. స్టార్ ఇమేజ్ తో పని లేకుండా.. ఇప్పుడు చిన్న సినిమాలే కాసుల వర్షం కురుస్తున్నాయి.

Shocking Murder: ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మూడో భార్య.. రెండో భార్య ఏం చేసిందంటే!

ఒకప్పుడు కనీసం నెలకొక స్టార్ హీరో సినిమా అన్నా విడుదల అయ్యేది. కానీ, ఇప్పుడంత సినిమా లేదనే చెప్పవచ్చు. కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా మన స్టార్స్ వెండి స్క్రీన్ పై కనిపించట్లేదు. ఈ విషయాన్నీ 2025లో గమనించినట్లయితే.. సంక్రాంతి పండుగకి రామచరణ్, బాలకృష్ణ, వెంకటేష్ సినిమాలు వచ్చాయి. అంతే, ఆ తర్వాత ఆరు నెలల తర్వాత జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 14న కూలీ, వార్ 2 విడుదల అయ్యాయి.

వందల కోట్లు పెట్టిన సక్సెస్ వస్తుందనే గ్యారెంటీ లేదు. అదే క్వాలిటీ కాంటెంట్ ఉండి కాస్త తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. కాస్త మీడియం బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో వెంకటేష్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమాతో 2025 లో ఇప్పటివరకు టాలీవుడ్ ను కాపాడింది.. కాపాడుతున్నది.. పెద్ద సినిమాలు కాదు, చిన్న మీడియం రేంజ్ సినిమాలే అని అర్థం చేసుకోవచ్చు.

Hardik Pandya: హార్దిక్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆసియా కప్‌ ప్రైజ్‌ మనీకి 10 రెట్లు!

ఇక బడ్జెట్ తక్కువ కంటెంట్ ఎక్కువగా ఉన్న మిడ్ రేంజ్ చిన్న సినిమాలే కాసులు కురిపించాయి. హరిహర వీరమల్లు, కింగ్ డమ్, వార్ 2 లాంటి సినిమాలు నిరాశపరిచిన ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా విజయం దిశగా అడుగులేస్తోంది. చాలా తక్కువ స్క్రీన్స్ లో విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కొత్త లోకకు కూడా మంచి వసూళ్లే వస్తున్నాయని సమాచారం. ఇవన్నీ చూస్తే.. ఒక్కటే చెప్పవచ్చు.. బడ్జెట్ కాదు కాంటెంట్ ముఖ్యం అని.

Exit mobile version