Site icon NTV Telugu

Bulandshahr Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కంటైనర్.. 8 మంది మృతి

Bulandshahr Accident

Bulandshahr Accident

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బులంద్‌షహర్‌లోని జాతీయ రహదారి 34లోని ఘటల్ గ్రామం సమీపంలో, రాజస్థాన్‌లోని కాస్‌గంజ్ నుంచి గోగామెడికి వెళ్తున్న గోగాజీ భక్తులతో బయలుదేరిన ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 8 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 60 మంది భక్తులు ఉన్నారని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Also Read: Saudi hero: ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు సౌదీ రాజు ఫిదా.. ఎన్ని మిలియన్ రియాల్స్ గిఫ్ట్ అంటే

కాస్గంజ్ జిల్లాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని రఫాయద్‌పూర్ గ్రామానికి చెందిన దాదాపు 60 మంది భక్తులు ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలోని గోగమేడి ఆలయానికి వెళ్లడానికి ట్రాక్టర్ ట్రాలీలో బయలుదేరారని బులంద్‌షహర్ రూరల్ ఎస్పీ డాక్టర్ తేజ్‌వీర్ సింగ్ తెలిపారు. బులంద్‌షహర్‌లోని ఆర్నియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటల్ గ్రామం సమీపంలో, ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వస్తున్న హైస్పీడ్ తో కంటైనర్ ట్రక్కు ఢీకొట్టింది. ట్రాలీలో ప్రయాణిస్తున్న భక్తులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడని వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

Exit mobile version