NTV Telugu Site icon

Constable Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్

New Project (18)

New Project (18)

Constable Illegal Affair: అతనో ప్రభుత్వ ఉద్యోగి. అంతకు మించి సమాజంలోని శాంతి భద్రతలు కాపాడే పదవిలో ఉన్నాడు. నలుగురి ఆదర్శంగా ఉంటూ సమాజంలో తలెత్తే చీడలను తొలగించడం అతడి విధి. కానీ అతడే దారి తప్పాడు. మరో లేడీ కానిస్టేబుల్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ కుటుంబాన్ని బాధలకు గురిచేశాడు. గర్భిణిగా ఉన్న భార్యకు అండగా నిలవాల్సింది పోయి పరాయి మహిళ మోజులో పడి ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. పెద్దల మధ్య పంచాయితీ పెడితే నా అంతటోడు లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దీమా వ్యక్తం చేస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం తొండపల్లిలో శ్రీశైలం ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని మధాపూర్ డీసీపీ శిల్పవల్లి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడు శ్రీశైలం. అతడికి 2021 లో మిట్టకోడూరుకు చెందిన నర్సింహులు కుమార్తె తో వివాహం జరిపించారు పెద్దలు. ప్రస్తుతం ఆమె గర్భిణి. దీంతో ఆమెపై మొహం చాటేశాడు.

Read Also:Shanmukh Jaswanth: అరేయ్.. ఏంట్రా ఇది.. దీప్తిని వదిలేసి కొత్త లవర్ తో ముద్దులు

బాధితురాలి వివరాల ప్రకారం.. తను గర్భిణి కావడంతో.. మరో లేడీ కానిస్టేబుల్ తో శ్రీశైలం అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. బంధువులంతా ఎంతో నచ్చజెప్పి చూశారు. కానీ శ్రీశైలం బుద్ధి మారలేదు. పెద్దల మధ్య పంచాయతీ పెట్టి మాట్లాడి చూశారు. పంచాయతీలో.. మీ ఇష్టమొచ్చినట్లు ఏమైనా చేసుకోండంటూ కానిస్టేబుల్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. చేసేదేమీ లేక ఆమె భర్త ఇంటి ముందు బంధువులతో బైటాయించింది.

Read Also: Minister KTR: రైతుల వెన్నంటే ఉండాలి.. వారికి భరోసా కల్పించాలి

ఇది ఇలా ఉండగా.. ఓ టీచర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం సయ్యద్ పల్లిలో చోటు చేసుకుంది. సయ్యద్ పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రాజేందర్.. ప్రతి రోజూ స్కూల్ కి తాగొచ్చి విచక్షణా రహితంగా విద్యార్థులను చితకబాదేవాడు. పిల్లల తల్లిదండ్రులు ఎన్ని సార్లు హెచ్చరించినా తన అలవాటు మానుకోలేదు. దీంతో రాజేందర్ పై ఆగ్రహించిన గ్రామస్థులు డీఈఓ కు ఫిర్యాదు చేశారు.ఈ నెల 15న రాజేందర్ ను విధులనుంచి సస్పెండ్ చేశారు.

Show comments