Site icon NTV Telugu

Women Fight: అట్లుంటది మరీ.. మహిళల గొడవలో తలదూర్చిన కానిస్టేబుల్ సస్పెండ్

Constable

Constable

Women Fight: నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మోపాల్ పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్‌ మూర్తి తలదూర్చడమే సస్పెండ్‌కు కారణమని తెలిసింది. అయితే గొడవపడిన ఇద్దరు మహిళల్లో ఒకరు సస్పెండ్‌ అయిన మూర్తి భార్యే కాగా.. మరొకరు ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్ భార్య అని సమాచారం.

Read Also: Teacher illicit affair: మహిళా టీచర్‌తో కొడుకు శృంగారం.. మొబైల్ ట్రాకింగ్ యాప్‌తో రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్న తల్లి..

కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌ నివాసాలు పక్కపక్కనే ఉండగా.. వారి భార్యల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ గొడవలో కానిస్టేబుల్‌ తలదూర్చి ఇన్‌స్పెక్టర్‌ భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌ సీపీకి ఫిర్యాదు చేయగా.. ఆయన విచారణ జరిపించి కానిస్టేబుల్‌ మూర్తిని సస్పెండ్ చేశారు.

Exit mobile version