Site icon NTV Telugu

Group-1: సత్తా చాటిన కానిస్టేబుల్.. గ్రూప్-1 ఫలితాల్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగం

Tgpsc

Tgpsc

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 563 ఖాళీలలో, ఒక పోస్టుపై హైకోర్టులో విచారణ ఉన్నందున 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో ఓ కానిస్టేబుల్ సత్తాచాటారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెప్పర్ వాడకు చెందిన శశిధర్ రెడ్డి(కానిస్టేబుల్) గ్రూప్-1 ఫలితాల్లో ఏ టి ఓ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచారు. కానిస్టేబుల్ నుంచి గ్రూప్ వన్ కు ఎంపికై కష్టపడితే ఫలితం తథ్యం అని నిరూపించారు.

Also Read:Sujeeth: పవన్ ని కలిస్తే చాలు అనుకునే నేను ఆయనతో బ్లాక్ బస్టర్ కొట్టా!

గత రాత్రి విడుదలైన ఫలితాలలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా ( Assistant Treasury officer (ATO))మల్టీ జోన్ వన్ కు ఎంపికయ్యారు. గ్రూప్ 1 కు ఎంపిక కావడంతో కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది. శశిధర్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒక్క ఉద్యోగం సాధించడం గగనం అయిన పోయిన తరుణంలో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. కాగా శశిధర్ రెడ్డి మొత్తం నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అవి ఏంటంటే?

Also Read:Malegaon blasts case: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్దోషి పురోహిత్‌కు “కల్నల్”గా ప్రమోషన్..

సాధించిన ఉద్యోగాలు

1. 2017 సంవత్సరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగం.
2. 2016 సంవత్సరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం రావడం జరిగింది. (దానికి వెళ్లలేదు)
3. 2024 సంవత్సరంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించడం జరిగింది. (దానికి వెళ్లలేదు)
4. 2025 సంవత్సరం లో గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం జరిగింది. అసిస్టెంట్ ట్రెజరర్ ఆఫీసర్.

Exit mobile version