పోలీస్ శాఖలో అక్రమార్కులు పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని అరికట్టాల్సిన ‘రక్షక భటులే భక్షక భటులుగా’ మారుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చేతులు చాచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎయిర్‌పోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ అడుగు ముందుకేసి అక్రమ దందా ప్రారంభించారు. అక్రమ సొమ్ముకు కక్కుర్తి పడి తమ స్థాయిని, బాధ్యత మరిచారు. కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన పోలీసులే అడ్డదారుల తొక్కారు. అసలేం జరిగిందంటే..
READ MORE: RK Roja: ఇచ్చిన హామీ ఏమైంది..? పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం..?
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొని.. బయట వ్యక్తులకు బ్లాక్‌లో అమ్ముతున్న కానిస్టేబుల్, హోమ్ గార్డ్‌ను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదు గురిపై కేసు నమోదు చేశారు. వీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జెమ్యా నాయక్, హోమ్ గార్డ్ బండారి లింగయ్య ఈ ఉదంతానికి పాల్పడ్డారు. పలువురు ప్యాసింజర్ల పేరుతో ఎయిర్‌పోర్టులో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు. లిక్కర్ షాప్ కౌంటర్ లో పనిచేస్తున్న మహేష్ తో కలిసి దందా కొనసాగించారు. వీరి నుంచి 41 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Fact Check: ఆసుపత్రిలో మన్మోహన్ సింగ్ చివరి ఫొటో వైరల్..