NTV Telugu Site icon

T. Harish Rao: హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao

Harish Rao

హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే mlc గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హరీష్ రావు హాజరై మాట్లాడారు. గోదావరి నీళ్లను ఒక్క చుక్కా తీసుకోకద్దు అంటూ కొట్లాడామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం గోదావరి నీళ్లు కాపాడే ప్రయత్నమే చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని మోసం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలేదని అంటున్నారన్నారు.

READ MORE: Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..

ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మేము చెప్పలేదంటున్నారని హరీష్ రావు అన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాదా.. ఇక రేట్లు పెంచుతారన్నారు. భూముల రేట్లు పెంచుతారట.. కరెంటు రేట్లు పెంచుతారట.. సంక్షేమంలో కోత విధిస్తారని విమర్శించారు. ఇస్తా అన్న హామీలకు తూట్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడంతోనే మార్పు మొదలవుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పట్టభద్ర ఓటర్లను కోరారు.

కాగా.. శాసనమండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. దీనికి సంబంధించి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే.. వారిలో పురుషులు 2,87,007, మహిళలు 1,74,794, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఈసీ నియమించింది.