NTV Telugu Site icon

Lok sabha: ప్రొటెం స్పీకర్‌గా కె.సురేష్.. ఏ పార్టీ వ్యక్తి అంటే..!

Speker

Speker

18వ పార్లమెంట్ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా కోడికున్నిల్ సురేష్‌కు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. అత్యధిక సార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన వ్యక్తిగా సురేష్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు అతడు ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. కేరళలోని మావెలికర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. ప్రొటెం స్పీకర్‌గా సురేష్‌ను (68) ప్రభుత్వం ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జూన్ 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రెండ్రోజులు 24, 25 తేదీల్లో ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ ప్రయాణం చేయించనున్నారు. ఇందుకోసం జూన్ 24న కె.సురేష్‌చే రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఇక స్పీకర్ ఎన్నిక జూన్ 26న జరగనుంది. దీని కోసం ఎన్డీఏ కూటమిలో పోటీ నెలకొంది. ఆ పోస్టుపై జేడీయూ, టీడీపీ కన్నేసింది. ఇక స్పీకర్ ఎన్నిక వరకు ప్రొటెం స్పీకర్‌ కొనసాగనున్నారు.

ఇది కూడా చదవండి: Tata Nexon CNG Launch: సరికొత్త ఒరవడిని సృష్టించడానికి సిద్దమవుతున్న టాటా నెక్సాన్..

సురేష్.. 1962, జూన్ 4న జన్మించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. అంతేకాకుండా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఇక లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్, అలాగే కార్మిక మరియు ఉపాధి సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారు. 1989లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991, 1996, 1999లో అదూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు.1998, 2004లో ఓటమి పాలయ్యారు.

ఇది కూడా చదవండి: Pavitra Cube: కన్నడ సినీ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ‘పవిత్ర’లు

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. మెరుగైన స్థానాలు సంపాదించింది. సింగిల్‌గా 99 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరి ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమి ఆశిస్తోంది. ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేయాలని భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Haryana video: రెండు ట్రక్కులు ఢీ.. వాహనాలు పూర్తిగా దగ్ధం