Site icon NTV Telugu

Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్‌లో బీజేపీ డీలా..

Congress

Congress

Bengaluru City: భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా అర్బన్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతారు.. కానీ, కొన్నిసార్లు అది తారుమారు అవుతుంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కీలంగా ఉన్న బెంగళూరు సిటీలో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది.. బెంగళూరు సిటీలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉంటే.. అందులో 17 సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్‌.. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అంకేల్‌ సెగ్మెంట్‌ను బి.శివన్న 31 వేల 325 ఓట్ల ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. బీటీఎం లేఅవుట్‌ స్థానంలో రామలింగారెడ్డి 9 వేల 222 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చామరాజ్‌పేటలో జమీర్‌ అహ్మద్‌ఖాన్ 53 వేల 953 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గాంధీనగర్‌లో దినేష్‌ గుండూరావ్‌ కేవలం 105 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. గోవిందరాజ నగర్‌లో ప్రియకృష్ణకు 12 వేల 516 ఓట్ల మెజార్టీ వచ్చింది. హెబ్బళ్‌లో బి.ఎస్ సురేష 30 వేల 754 మెజార్టీతో విజయం సాధించారు. జయనగర్‌ నుంచి సౌమ్య రెడ్డి కేవలం 294 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సీఎం రేస్‌లో ఉన్న డీకే శివకుమార్‌ కనకపురలో లక్షా 22 వేల 392 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కునిగల్‌లో డాక్టర్‌ రంగనాథ్‌కు 26 వేల 573 ఓట్ల మెజార్టీ దక్కింది. మగదిలో హెచ్‌.సి. బాలకృష్ణకు 11 వేల 839 మెజార్టీ వచ్చింది. పులకేసి నగర్‌లో ఎ.సి.శ్రీనివాస 62 వేల 210 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామ నగరంలో ఇక్బాల్‌ హుస్సేన్‌కు 10 వేల 715 ఓట్ల ఆధిక్యం దక్కితే, సర్వ నగర్‌లో కె.జె.జార్జ్‌కు 55 వేల 768 మెజార్టీ లభించింది. శాంతి నగర్‌లో ఎన్‌.ఎ.హారిస్ 7 వేల 125 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శివాజీ నగర్‌లో రిజ్వాన్‌ అర్షద్‌ 23 వేల 194 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయ నగర్‌లో ఎం.కృష్ణప్పకు 7 వేల 324 ఓట్ల మెజార్టీ దక్కింది.

ఇక, బెంగళూరు సిటీలో కమలనాథులు 14 సీట్లకే పరిమితయ్యారు. మూడు సెగ్మెంట్లలో 50వేలకు పైగా ఓట్ల మెజార్టీ దక్కింది. బెంగళూరు సౌత్‌లో ఎం.కృష్ణప్ప 49 వేల 699 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బసవన్నగుడి స్థానాన్ని రవి సుబ్రహ్మణ్య 54వేల 978 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. బొమ్మనహళ్లి నుంచి ఎం. సతీష్‌ రెడ్డి 24 వేల 215 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సి.వి.రామనగర్‌లో ఎస్‌.రఘుకు 16 వేల 395 ఓట్ల మెజార్టీ దక్కింది. చిక్‌పెట్‌లో ఉదయ్‌ గరుదచర్ 12వేల 113 ఓట్లు, దసరహళ్లిలో మునిరాజ్ 9వేల 194 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కె.ఆర్‌.పురలో బి.ఎ.బసవరాజకు 24 వేల 301 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు ఓటర్లు. మహదేవపురలో ఎస్‌.మంజుల 44 వేల 501 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మహాలక్ష్మి లేఅవుట్ సెగ్మెంట్‌లో కె.గోపాలయ్య 51 వేల 165 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొమ్మై కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ అశ్వత్ నారాయణ మల్లేశ్వరంలో 41 వేల 302 ఓట్ల ఆధిక్యం కనబర్చారు.పద్మనాభ నగర్‌లో ఆర్. అశోక 55 వేల 175 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ నగర్‌లో ఎస్.సురేష్‌ కుమార్‌కు 8 వేల 60 ఓట్ల ఆధిక్యం దక్కింది. రాజరాజేశ్వరి నగర్‌లో మునిరత్న 11వేల 842 ఓట్ల మెజార్టీ సాధించారు. యశ్వంత్‌పురలో ఎస్‌.టి.సోమశేఖర్‌ 15 వేల 118 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. మరోవైపు.. బెంగళూరు సిటీ చన్నపట్న నియోజకవర్గంలో పోటీచేసిన జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేవలం 15 వేల 915 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. కుమారస్వామి చేతిలో బీజేపీ అభ్యర్థి యోగేశ్వర ఓడిపోయారు.

Exit mobile version