NTV Telugu Site icon

Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

Rahul On Elections

Rahul On Elections

Rahul Gandhi: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. తన పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయించి బీజేపీ ప్రభుత్వం తనకు ఒక రకంగా మంచి గిఫ్ట్ ఇచ్చిందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల తర్వాత బీజేపీని అధికారం నుంచి దించగలదన్న విశ్వాసాన్ని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న గాంధీ నిన్న వాషింగ్టన్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు.

Read Also: Telangana : కామారెడ్డిలో అమానుషం.. బైక్ పై తీసుకెళ్లి మాహిళపై అత్యాచారం..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగ్గా పనిచేస్తుందని తాను భావిస్తున్నాను అన్నారు. ఇది ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తుందని రాహుల్‌ తెలిపారు. ప్రతిపక్షం ఐక్యంగా ఉండి బీజేపీని ఓడిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని చెప్పారు. ప్రతిపక్షం ఐక్యంగా ఉంది. కాంగ్రెస్‌ అన్ని ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతుందన్నారు. అక్కడక్కడా ప్రతిపక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కొనసాగుతుందన్నారు. కొన్నిచోట్ల తాము తగ్గడం.. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలు తగ్గడం తప్పదన్నారు. దేశంలో మహా ప్రతిపక్ష కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించడం ఖాయమని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను తమ అధీనంలో పెట్టుకొని, నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గతంలో వివిధ ప్రతిపక్ష నాయకులు చేసిన అభియోగాన్ని అధికార పార్టీ తిరస్కరించిందని గుర్తు చేశారు.

Read Also: Margani Bharat: టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం

రాహుల్ గాంధీని విదేశాలలో మాట్లాడటానికి ఎందుకు ఆహ్వానిస్తారో ఆలోచించమని ప్రజలకు వదిలివేస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. పరువు నష్టం కేసులో బీజేపీ తనపట్ల వ్యవహారించిన తీరు తనకు గిఫ్ట్ లాంటిదని రాహుల్‌ గాంధీ అన్నారు. అది తనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. పుట్టిన వారు చనిపోక తప్పదని.. తాను ఎపుడు కూడా చావుకు, బెదిరింపులకు భయపడటం లేదన్నారు. తన నానమ్మ, తండ్రి మరణాలు తనకు గుర్తు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్‌ మరోసారి తెలిపారు. ఈ నెలాఖరులో భారత ప్రధాన మంత్రి అమెరికా పర్యటన ఉన్న సందర్భంగా అంతకంటే ముందే ఇపుడు రాహుల్‌ గాంధీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Show comments