Site icon NTV Telugu

Congress Helps BJP In Gujarat : గుజరాత్‎లో ఇరుక్కున్న బీజేపీకి కాంగ్రెస్ సాయం

Bjp

Bjp

Congress Helps BJP In Gujarat : మేం నాయకులం.. ప్రజల ఎదుటే శత్రువులుగా నటిస్తాం.. కానీ వారి వెనుక మేం ఒక్కటిగా కలిసే ఉంటామని ఓ సినిమాలో సన్నివేశం ఇప్పుడు మీరు చదువుతున్న వార్తకు సరిగ్గా అద్దినట్లు సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే వచ్చే నెలలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పలు పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా నాయకులంతా ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితీరాలని పట్టుదలతో ఉన్నారు.

Tirumala Devotee: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 40గంటలు

దీంతో పార్టీలన్నీ ప్రచారానికి ప్రత్యేక వాహనాలను డిజైన్ చేయించి.. ఊర్లలో మైకులతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీజేపీ రథం ఇసుకలో కూరుకుపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా బయటకు రావట్లేదు. ఇంతలో అటుగా వచ్చిన కాంగ్రెస్ ప్రచార రథం దీనికి సాయం చేసింది. తాళ్లతో కట్టి బీజేపీ ప్రచార రథాన్ని బయటకు లాగింది. ఇదంతా అక్కడున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బీజేపీ రథాన్ని లాగుతున్న కాంగ్రెస్ రథం అంటూ వ్యాఖ్యానించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Exit mobile version