Congress Manifesto: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీతో హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ తన పది పాయింట్ల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను శనివారం సీనియర్ నేత భూపేష్ బఘేల్ సమక్షంలో విడుదల చేసింది.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు ఇవే..
1. పాత పింఛను పథకం అమలు
2. లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు
3. యువతకు 5 లక్షల ఉద్యోగాలు
4. యువతకు రూ.680 కోట్లు స్టార్టప్ ఫండ్
5. మహిళలకు నెలకు రూ.1,500
6. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
7. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు
8. ప్రతి గ్రామంలో ఉచిత చికిత్స కోసం మొబైల్ క్లినిక్‌లు
9. ఆవు పేడ కిలో ధర రూ. 2 కొనుగోలు చేస్తామని హామీ
10. పశువుల పెంపకందారుల నుంచి 10 లీటర్ల పాలకు, వ్యవసాయదారులు వ్యవసాయ ఉత్పత్తులకు ధర నిర్ణయించే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది.
ఈమేరకు మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేస్తుందన్నారు.కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడ్డాక అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం, ఏం హామీ ఇచ్చినా నెరవేరుస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో కూడా రైతు రుణమాఫీకి హామీ ఇచ్చామని, దానిని అమలు చేశామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రాలో ఒక బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హిమాచల్ ప్రజలకు వాగ్దానాలు చేసింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో చేసిన విధంగా ఇక్కడి రైతుల జీవితాల్లో మార్పు తీసుకువస్తామని నొక్కి చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.హిమాచల్ ప్రదేశ్‌లో విజయాన్ని నమోదు చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వచ్చే శనివారం జరగనున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీలో ఉన్నాయి.
Arvind Kejriwal Big Claim: గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ బిగ్ ఆఫర్
ఇంకా తన మేనిఫెస్టోను విడుదల చేయని బీజేపీ, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రచారాన్ని పెంచింది. హిమాచల్ ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ‘హక్కుల పరిరక్షణ’ ఎన్నికలు అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం అన్నారు.ఈ ఎన్నికలు మీ హక్కుల పరిరక్షణకు జరుగుతున్న ఎన్నికలు.. ఎవరికి హక్కు కల్పించాలో మీరే తేల్చుకోవాలని ఓటర్లకు ఆయన సూచించారు. .రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే బీజేపీ ఎంతో అభివృద్ధి చేసిందని ఆయన ఉద్ఘాటించారు. గత ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 44 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది.
