లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మూడు పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా కేబీఆర్.నాయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఎస్కే.బషీద్, చిత్తూరు ఎంపీగా జగపతి పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది. ఇక అసెంబ్లీకి 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. చీపురపల్లి, శృంగవరపుకోట, విజయవాడ ఈస్ట్, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, కొండెపి, మార్కాపురం, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయానికి అభ్యర్థుల్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: The Delhi Files: ది ఢిల్లీ ఫైల్స్ మొదలవుతోంది!
ఏపీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కొన్ని గంటల ముందే కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Crime: సోదరి వివాహ కానుకపై వివాదం.. భర్తని కొట్టి చంపిన భార్య..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత ఈ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేసింది. అలాగే బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. అలాగే మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
Dke
