NTV Telugu Site icon

Congress: మరో జాబితా విడుదల.. వరంగల్ సీటు ఎవరికి దక్కిందంటే..!

Kaya

Kaya

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను వెల్లడించింది.

ఇది కూడా చదవండి: CM Jagan Bus Yatra: రేపు ఆరో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్..

మహారాష్ట్రలోని అకోలా నుంచి అభయ్ కాశీనాథ్ పాటిల్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే కడియం కావ్య కొన్ని గంటల ముందే కాంగ్రెస్‌లో చేరారు. తొలుత ఆమెకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ సీటు లభించింది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టత దెబ్బతింది అంటూ పార్టీకి లెటర్ రాసి పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తన తండ్రి కడియం శ్రీహరితో పాటు కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల్లోనే ఆమెకు తిరిగి కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Toll fee: వాహనదారులకు శుభవార్త.. టోల్‌ ఛార్జీలపై ఈసీ ఆదేశాలివే!

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ దాదాపుగా పోటీ చేస్తు్న్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరికొన్ని స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు మేనిఫెస్టోపై కూడా ఫోకస్ పెట్టాయి. త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చేరిన బీఆర్ఎస్ నేతలకు సీట్లు లభించడం విశేసం. చేవళ్లలో రజింత్‌రెడ్డికి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌కు, వరంగల్‌లో కడియం కావ్యకు సీట్లు లభించాయి. ఇటీవలే వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వచ్చారు. అలా వచ్చారో.. లేదో.. ఇలా సీట్లు లభించాయి.

ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘హిట్ మ్యాన్’ ఖాతాలో చెత్త రికార్డు..

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25 మరియు జూన్ 1న తదుపరి ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో ఈనెల 5న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.