Site icon NTV Telugu

Congress President Poll : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Congress

Congress

Congress President Poll Schedule Released

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే.. ఈనెల 24 నుంచి 30 వరకూ ఉదయం 11 గంటలనుంచి 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం చేసుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా వెల్లడించారు. అలాగే.. 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ పోలింగ్‌ ఫలితాలను 19న ప్రకటించనున్నారు. అయితే.. ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అయితే, అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే స్వీకరించాలని కొందరు నేతలు భావిస్తున్నారు. 2019లో సోనియా తాత్కాలిక చీఫ్‌గా ఎన్నికైనప్పటి నుండి ఐదేళ్ల పదవీకాలంతో కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే పోల్ మూడేళ్లపాటు ఆలస్యమైంది. మరోవైపు ఈ ఎన్నికలు ఓ ప్రహసనమని కాంగ్రెస్ ప్రత్యర్థులు అంటున్నారు.

 

ఏది ఏమైనప్పటికీ, పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా ఇప్పటికే నిర్వహించాల్సిన పోల్ కొంతకాలం వాయిదా పడింది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్ర నాయకులు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఆయనతో కలిసి నడుస్తున్నారు. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ నిర్వహించాలనే ఉద్దేశం మంచిదే. అయితే, కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. శశి థరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ప్రద్యుత్ బోర్దోలోయ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు “స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా” ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు.

 

Exit mobile version