Site icon NTV Telugu

Kanhaiya Kumar: కన్హయ్య కుమార్ కు కాంగ్రెస్ కీలక పదవి..

Kanhaiya Kumar

Kanhaiya Kumar

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) ఇన్‌ఛార్జ్‌గా కన్హయ్య కుమార్‌ను కాంగ్రెస్ ఇవాళ (గురువారం) నియమించింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి కన్హయ్య కుమార్ నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.

Also Read: Smartwatch: అదిరిపోయే లుక్ లో ఆకట్టుకొనే ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ వాచ్..

కన్హయ్య కుమార్‌ను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ)కి అధ్యక్షుడిగా తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సంతకం చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే.. NSUIను 1971, ఏప్రిల్ 9న స్థాపించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ బెంగాల్ ఛత్ర పరిషత్ ను విలీనం చేసి ఎన్ఎస్‌యూఐను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎన్ఎస్‌యూఐకు నీరజ్ కుందన్ నేతృత్వం వహిస్తున్నారు.

Also Read: Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కన్హయ్య కుమార్‌ దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. 1987లో జన్మించిన కన్హయ్య కుమార్ పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతున్న సమయంలో స్టూడెంట్స్ పాలిటిక్స్ లో ఉన్నారు. 2015లో ఢిల్లీలోని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా, ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. సీపీఐకు 2021లో కన్హయ్య కుమార్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో అతను పాల్గొన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కన్హయ్య కుమార్ కాలినడకన నడిచారు.

Exit mobile version