Site icon NTV Telugu

Postcard Movement : రాహుల్ గాంధీపై అనర్హతపై పోస్టుకార్డు ఉద్యమం

Postcard Movement

Postcard Movement

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించనుంది. ఇవాళ గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ఆదివారం గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : Liquor Price Hiked: మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

ఏఐసీసీ పిలుపునిచ్చిన జై భారత్ సత్యాగ్రహ దీక్షల కార్యచరణను ఖరారు చేసేందుకు టీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మాణిక్ రావు థాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావెద్, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింట్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలె పోదెం వీరయ్య, సీతక్క, పీసీసీ మాజీ అధ్యక్షులు వి. హన్మంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య, కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్, పార్టీ ముఖ్య నేతలు పొన్నం ప్రభాకర్, నాగం జనార్థన్ రెడ్డి, కొండా సురేఖ, మల్లు రవితో పాటు పలువురు పాల్గొన్నారు.

Also Read : Liquor Price Hiked: మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు

ఏఐసీసీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహించని నేతలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలను నేతలంతా బాధ్యతాయుతంగా చేపట్టాలని, అందరినీ భాగస్వాములను చేయాలని థాక్రే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హాథ్ సే హాథే జోడో యాత్రలను పకడ్బందిగా నిర్వహించారని.. రేవంత్ రెడ్డి 30 నియోజకవర్గా్లో యాత్ర విజయవంతమైందని థాక్రే వెల్లడించాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికీ అందించాలని చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరుకానీ నాయకులను పదవుల నుంచి తొలగించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటి వరకు టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు ఐదుసార్లు జరగ్గా ఈ సమావేశాలకు ఒక్కసారి కూడా రాని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను 24 గంటల్లోగా పదవుల నుంచి తొలగించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Exit mobile version