Site icon NTV Telugu

Congress: ఏపీలో 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు..! వైఎస్‌ షర్మిల అక్కడి నుంచే బరిలోకి..!

Ys Sharmila

Ys Sharmila

Congress: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ రోజు ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్‌ సీఈసీ భేటీ ముగిసింది.. ఏపీలో 58 అసెంబ్లీ, 8 లోకసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఆమోదించింది సీఈసీ.. ఈ రోజు అభ్యర్ధులపై అధికారికంగా ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అరకు, నంద్యాల, అనంతపురం, అమలాపురం, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కర్నూలు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, ఈ రోజు ఏపీలోని 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో రఘువీరా రెడ్డి పోటీచేయరాదని నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తానని తెలిపారు రఘువీరా రెడ్డి.

ఇక, ఏపీలోని 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ సీఈసీ ఫైనల్‌ చేసినట్టు ప్రచారం సాగుతోన్న అభ్యర్థుల పేర్లను ఓసారి పరిశీలిస్తే..
• కడప – వైఎస్‌ షర్మిలా రెడ్డి.
• బాపట్ల – జేడీ శీలం
• కాకినాడ – పల్లంరాజు
• రాజమండ్రి – గిడుగు రుద్రరాజు
• విశాఖపట్నం – సత్యా రెడ్డి
• ఏలూరు – లావణ్య
• అనకాపల్లి – వేగి వెంకటేష్‌
• శ్రీకాకుళం – డీసీసీ ప్రెసిడెంట( పరమేశ్వరరావు)
• విజయనగరం – డీసీసీ ప్రెసిడెంట్ (రమేష్‌ కుమార్)
• ⁠రాజంపేట – నజీం అహమ్మద్
• చిత్తూరు – చిట్టిబాబు
• హిందూపూర్ – షాహీన్
• నరసరావు పేట – అలెగ్జాండర్
• నెల్లూరు – దేవకుమార్ రెడ్డి
• ఒంగోలు – సుధాకర్ రెడ్డి
• మచిలీపట్నం – గొల్లు కృష్ణను పేర్లను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version