NTV Telugu Site icon

Congress: ఆ ఇద్దరి నేతలకు కాంగ్రెస్ మొండిచేయి.. మరి వారి అడుగులు ఎటు..?

Addanki, Neelam Madhu

Addanki, Neelam Madhu

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థలను ప్రకటించడంతో పాటు వారికి బీ-ఫామ్ లు అందజేస్తుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కని వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగో విడతలో పటాన్ చెరు, తుంగతుర్తి కాంగ్రెస్ క్యాండీడెట్ లు ఎంపికతో బీసీ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన నీలం మధుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ లను పక్కన పెట్టెసేంది.

Read Also: Telangana Assembly Elections 2023: సెలబ్రిటీలను పక్కనబెట్టిన బీజేపీ.. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్..!

ఇక, పటాన్‌చెరులో నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్‌కు, తుంగతుర్తిలో మందుల సామియెల్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిన్న ఐదుగుర్లు పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది.. వారిలో సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ లో ముజీబ్ షరీఫ్ పేర్లను ప్రకటించింది. అయితే, నీలం మధు, అద్దంకి దయాకర్ ఇద్దరినీ నమ్మించి కాంగ్రెస్ పార్టీ గొంతు కోసింది అంటూ వారి అభిమానులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Read Also: Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్‌ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?

ఇక, ఇప్పుడు ఈ ఇద్దరి అడుగులు ఎటు వైపు వేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే, పటాన్ చేరు కాంగ్రెస్ టికెట్ మార్పుపై ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, మరో వైపు నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి నీలం మధు అనుచరుల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక, కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దిష్ట బొమ్మలను కాల్చి వేశారు. నీలం మధు ఇంటికి భారీగా అనుచరులు చేరుకుని ఆయన సంఘీభావం తెలియజేస్తున్నారు.

Read Also: Cylinder Blast: మోతిహారిలో సిలిండర్ పేలుడు.. మంటల్లో చిక్కున్న 25 మంది

నీలం మధు ఇవాళ స్వతంత్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు అద్దంకి దయాకర్ మాత్రం తనకు టికెట్ రాకపోవడంతో పార్టీలో సైలెంట్ అయ్యారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ముందుకు తుంగతుర్తి నుంచి తానే పోటీలో ఉంటానని చెప్పిన అద్దంకి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.