NTV Telugu Site icon

Amit Shah: ‘కాంగ్రెస్- పాకిస్థాన్‌ల ఉద్దేశాలు.. ఎజెండా ఒక్కటే’

Amit Shah

Amit Shah

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దు అంశంపై రాజకీయాలు వేడెక్కాయి. పాక్ రక్షణ మంత్రి ఇచ్చిన ప్రకటన కారణంగా ఎన్‌సీ, కాంగ్రెస్ రెండూ బీజేపీ టార్గెట్‌గా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. అమిత్ షా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో..” కాంగ్రెస్‌, పాకిస్థాన్‌ల ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని పేర్కొన్నారు. “ఆర్టికల్ 370, 35ఏ పై కాంగ్రెస్, జెకేఎన్‌సీకి పాకిస్థాన్ రక్షణ మంత్రి మద్దతు ఇవ్వడం మరోసారి కాంగ్రెస్‌ను బట్టబయలు చేసింది. కాంగ్రెస్, పాకిస్థాన్ ఉద్దేశాలు, ఎజెండా ఒక్కటేనని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ దేశప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తున్నారు.” అని రాసుకొచ్చారు.

READ MORE: Neha Sharma Bikini: వామ్మో నేహా శర్మ.. బికినిలో రోడ్స్ మీద షికార్లు!

దేశవ్యతిరేక శక్తులతో కాంగ్రెస్‌ హస్తం ఉంది: అమిత్‌ షా

“గత కొన్నేళ్లుగా రాహుల్‌ గాంధీ దేశప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి భారత వ్యతిరేక శక్తులకు అండగా నిలిచారు. వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్‌లకు సంబంధించిన సాక్ష్యాధారాలను డిమాండ్ చేసినా లేదా భారత సైన్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, పాకిస్థాన్‌లు ఎప్పుడూ ఒకే మాటపైనే ఉంటాయి. కాంగ్రెస్ హస్తం ఎప్పుడూ దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటుంది. కానీ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 లేదా ఉగ్రవాదం తిరిగి రాదని కాంగ్రెస్ పార్టీ, పాకిస్థాన్ మర్చిపోయాయి.” అని అమిత్ షా పేర్కొన్నారు.

READ MORE: Mahabubabad: విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..

పాక్ రక్షణ మంత్రి ఏం చెప్పారు?
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై, పాకిస్థాన్.. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతుగా ఉంటుందన్నారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తాము ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. షేక్ అబ్దుల్లా, నెహ్రూలు 370, 35ఏలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు ఎన్నికల్లో గెలిస్తే 370, 35ఏలు పునరుద్ధరిస్తారని ‘క్యాపిటల్ టాక్’ కార్యక్రమంలో ఖవాజా ఆసిఫ్‌ను పాకిస్థాన్ జర్నలిస్ట్ హమీద్ మీర్ అడిగారు. దీనిపై ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. “ఇది సాధ్యమేనని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ రెండూ బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. కాశ్మీర్ ప్రజలు కూడా ఈ అంశంపై చాలా ఉత్సాహంగా ఉన్నారు.” అని వ్యాఖ్యానించారు.