Site icon NTV Telugu

Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Naveen Yadav

Naveen Yadav

Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ లో 47 ఏళ్లలో ఎవరూ లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు.. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన పీజేఆర్ ప్రజల్లో ఉంటూ గొప్ప నేతగా ఎదిగారన్నారు.. అయితే పీజేఆర్ కూడా నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పీజేఆర్’గా పేదల గుండెల్లో నిలిచిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి 2007లో పదవిలో ఉండగానే గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారు. ఖైరతాబాద్‌ స్థానం నుంచి ఆయన 5 సార్లు గెలుపొందారు. తాజాగా నవీన్ యాదవ్ ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: డిస్‌ప్లే, పర్ఫామెన్స్, బ్యాటరీ అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చేసిన Huawei MatePad 12 X టాబ్లెట్

ఇదిలా ఉండగా.. తెలంగాణలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్‌ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్‌ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా.. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రకటన ఇటీవల వెలువడింది. పార్టీ నేత నవీన్‌ యాదవ్‌ పేరును అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ తీసుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ బీసీ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌కే అవకాశం ఇచ్చింది.. ఇక, నవంబర్‌ 11వ తేదీన జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ జరగనున్న విషయం విదితమే.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్‌ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

READ MORE: Trump Nobel Peace Prize: ఏం చేయకుండానే ఒబామాకు నోబెల్.. నేను 8 యుద్ధాలను ఆపాను!

Exit mobile version