NTV Telugu Site icon

Congress MP List: మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కాంగ్రెస్..!

11

11

కాంగ్రెస్ పార్టీ సార్వార్త ఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. బుధవారం రాత్రి 8 వ జాబితాని కాంగ్రెస్ పార్టీ విడుదల చేయగా.. అందులో 14 మంది పేర్లను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో మే13న జరగబోయే ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను పూర్తి చేసినట్లుగా కనపడుతుంది. చూడాలి మరి అన్ని పార్టీలు అనేక చర్చల తర్వాత వారి గెలుపు గుర్రాలను బరిలో దింపాయి. మరి ఎవరు విజయాన్ని చేరుతారో.

Also read: Gold Price Today : షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు..

ఇక తాజాగా వెలువడిన ఎనిమిదవ లిస్ట్ లో అభ్యర్థుల లిస్ట్ చూస్తే.. తెలంగాణ నుండి ఆదిలాబాద్‌ (ఎస్టీ) – డా.సుగుణ కుమారి చెలిమల, నిజామాబాద్‌ – తాటిపర్తి జీవన్‌ రెడ్డి, మెదక్‌ – నీలం మధు, భువనగిరి- చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిల పేర్లు వెల్లడించారు. ఇక ఝార్ఖండ్‌ నుండి కుంటి (ఎస్టీ)- కాళీచరణ్‌ ముండా, లోహర్దగ (ఎస్టీ)- సుఖ్‌దేవ్‌ భగత్‌, హజారిబాగ్‌ – జైప్రకాశ్‌భాయ్‌ పటేల్‌ ల పేర్లను ప్రకటించారు.

Also read: SRH vs MI: ఉత్కంఠ పోరులో తొలి విజయం సాధించిన సన్ రైజర్స్..

అలాగే మధ్యప్రదేశ్‌ నుండి గుణ- రావు యద్వేంద్ర సింగ్‌, దామోహ్‌: తావర్‌ సింగ్‌ లోధి, విదిశ – ప్రతాప్‌ భాను శర్మ లు పోటీ చేయనుండగా.. ఉత్తరప్రదేశ్‌ లో ఘజియాబాద్‌ – డాలీ శర్మ, బులంద్‌షహర్‌ (ఎస్సీ) – శివరాం వాల్మికి, సీతాపుర్‌ – నకుల్‌ దూబే, మహారాజ్‌గంజ్‌ – వీరేంద్ర చౌధరిలు పోటీలో ఉన్నారు.