NTV Telugu Site icon

MP Komati Reddy Venkat Reddy: ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ భేటీ

Mp Komati Reddy

Mp Komati Reddy

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ( శుక్రవారం ) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నాడు.

Read Also: Rahul Gandhi: సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. నా దారి క్లియర్గానే ఉందంటూ ట్వీట్

ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. రోజు రోజుకు హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతోందని, ప్రజా అవసరాల దృష్ట్యా రోడ్డును అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read Also: Salar First Single: ఇక చాలు, విసిగిపోయాం.. మాకు ఇప్పుడు కావాల్సిందే అంటున్న ప్రభాస్ ఫాన్స్!

మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ప్రధానికి విన్నవించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-విజయవాడను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్ల మరమ్మతు అంశంపైనా మరింత నజర్ పెట్టాలని ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సూచించినట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి అన్నారు. అయితే, రాష్ట్రంలోని ప‌లు అంశాల‌పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించినట్లు తెలిపారు.