Site icon NTV Telugu

Congress MLA: ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసు.. ఇంకేం తెలియదు..!

Congress

Congress

బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివ శంకరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దావణగెరె స్థానం నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం శివ శంకరప్ప ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.

Read Also: BRS KTR: కేటీఆర్‌పై బంజారాహిల్స్‌ లో కేసు నమోదు.. కారణం ఇదీ..!

ఇక, దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బీజేపీ పోటీలో నిలిపింది. గాయత్రి సిద్దేశరను ఉద్దేశించి ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ఆమె ఎన్నికల్లో విజయం సాధించి మోడీకి కమలం అందించాలనుకుంటోందన్నారు. ముందు దావణగెరె సమస్యలను తెలుసుకోవాలి.. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం.. కనీసం మీకు మాట్లాడటం కూడా తెలియదు.. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు.. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదంటూ శివశంకరప్ప విమర్శలు గుప్పించారు.

Read Also: Uttarpradesh : నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన మహంత్.. ముక్కలుగా గోనెసంచిలో లభ్యం

అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర రియాక్ట్ అయింది. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారు.. కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళలు ఇంట్లోని అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదనుకుంటా.. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని మోడీ ప్రోత్సాహం అందిస్తున్నారని గాయత్రి సిద్దేశ్వర పేర్కొన్నారు.

Exit mobile version