Site icon NTV Telugu

Yashaswini Reddy: కన్నీరు పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. కారణం ఏంటంటే?

Yashaswini Reddy

Yashaswini Reddy

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. ఇంతకీ ఈ యువ ఎమ్మెల్యేకి ఏం కష్టమొచ్చింది. కన్నీరు పెట్టడానికి గల కారణం ఏమయ్యుంటుందబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో యశస్విని రెడ్డి పాల్గొన్నది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసే సమయంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకుంది.

Also Read:Operation Sindoor: ఆప్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ‘నో’ చెప్పిన కేంద్రం.!

కాంగ్రెస్ ప్రభుత్వంలో తన చేతుల మీదుగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందజేయడం పట్ల బాగోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆ సమయంలో పక్కనే ఉన్న మహిళలు ఊరుకో అక్కా అంటూ ఓదార్చారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి నిధులను మంజూరు చేస్తోంది.

Exit mobile version