NTV Telugu Site icon

Vinay Kulkarni : ప్రచారం చేయకుండానే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Vinay

Vinay

కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి.. హస్తం పార్టీకి పట్టం కట్టారు. ఎగ్జిట్‌పోల్స్ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని అధికారం చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో ధార్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్యరీతిలో గెలవడం.. కన్నడనాట పాలిటిక్స్ లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధార్వాడ రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్ కులకర్ణి ఘనవిజయం సాధించారు. వినయ్ కులకర్ణి కనీసం నామినేషన్ వేసేందుకు కూడా వెళ్లలేదు.. ఏ ఒక్కచోటా ఆయన కనీసం ప్రచారం చేయలేదు. అయిన ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్‌పై 18 వేల 114 ఓట్ల తేడాతో గెలిచారు. వినయ్ కులకర్ణికి 88 వేల 660 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అమృత్ అయ్యప్ప దేశాయ్‌కు 70 వేల 546 ఓట్లు వచ్చాయి.

Also Read : Kamal Haasan: కాంగ్రెస్ విజయం, రాహుల్ గాంధీ గురించి కమల్ హాసన్ ఏమన్నారంటే..?

కాగా ధార్వాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కులకర్ణి ఫప్ట్ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినయ్ కులకర్ణి కోర్టు ఉత్తర్వులతో నామినేషన్ పత్రాలు సమర్పించలేకపోయారు. ఒక్కరోజు కూడా తన నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించలేదు.. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ మెజార్టీతో గెలిచారు. వినయ్ కులకర్ణి తరపున అతని కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేశారు.

Also Read : Karnataka Elections: చాలెంజ్‌ అంటే ఇదే.. భారీ మెజార్టీతో విక్టరీ కొట్టిన 92 ఏళ్ల కురువృద్ధుడు

ధార్వాడ్ రూరల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన వినయ్ కులకర్ణి ఆది నుంచి ఇబ్బందికర పరిస్థితిస్థిని ఎదుర్కొన్నారు. ధార్వాడ జిల్లా కలెక్టర్ యోగీష్ గౌడ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వినయ్ ధార్వాడ జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. దీంతో వినయ్ కులకర్ణి సతీమణి శివలీల తన మద్దతుదారులతో కలిసి ప్రచారం చేశారు. కేవలం కులకర్ణి వీడియో, ఆడియో కాల్స్ ద్వారా ఓటర్లకు చేరువయ్యారు.

Also Read : MLA Seethakka : కర్ణాటక ఫలితాలతో మాకు బాధ్యత కూడా పెరిగింది

అయితే బీజేపీ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే అమృత్ దేశాయ్ మాత్రం ధార్వాడ్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎం బసవరాజ్ బొమ్మై, సినీ నటుడు సుదీప్, బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎమ్మెల్యే బసవగౌడ వంటి వారు అమృత్ దేశాయ్ తరపున ప్రచారం చేశారు.. అయినప్పటికీ వినయ్ కులకర్ణి భారీ విజయాన్ని సాధించారు.