Site icon NTV Telugu

Mizoram Elections 2023: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Mijoram Cong

Mijoram Cong

మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్‌పిజి సిలిండర్‌, నెలకు రూ. 2 వేలు పెన్షన్‌, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు. మిజోరం ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) ముఖ్య అధికార ప్రతినిధి రోనాల్డ్‌ సప తలై మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సమర్థంగా, పారదర్శకంగా, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Read Also: Mansoor Ali Khan: టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు

రాష్ట్రంలో కనెక్టివిటీ, విమానాశ్రయం, విద్యుత్ తదితర మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ ఫండింగ్ కేటాయింపు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడితే.. కాంగ్రెస్ యంగ్ మిజో ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ (YmElevate)ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా.. మిజో యువతకు 1 లక్ష ఉద్యోగాలను ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Read Also: Balayya : విజ్జి పాప టాలీవుడ్ కి దొరికిన అదృష్టం..

ప్రభుత్వ ఉద్యోగి లేని కుటుంబాలకు రూ.15 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. కోలుకోలేని రోగుల కోసం పార్టీ రూ.5 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తామన్నారు. అలాగే.. వృద్ధాప్య పింఛను నెలకు రూ.2000 ఇస్తామని తెలిపారు. ఏఏవై, పీహెచ్‌హెచ్‌ కార్డుదారులు, మహిళా కుటుంబ సభ్యులకు సబ్సిడీపై ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.750 అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Exit mobile version