Site icon NTV Telugu

Mahesh Kumar Goud : ఢిల్లీలో అమిత్ షా, కేసీఆర్ ఒకటయ్యారు

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

ఢిల్లీలో అమిత్ షా, కేసీఆర్ ఒకటయ్యారని వ్యాఖ్యానించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కి కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకి ఆయన రాజకీయ పరిజ్ఞానం అంతే అనుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తొమ్మిదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ని ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉందని, అది ప్రజలకు కూడా తెలుసునన్నారు. ఈటల లాంటి సీనియర్ నేత రాజకీయ కుట్రలు చేయడం సరికాదని హితవు పలికారు.

Also Read : Corona: వరుసగా ఐదవ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు..

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తోందని, అవినీతి దోపిడీలపై క్రమం తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉందన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పిదాలను ప్రశ్నిస్తూనే ఉన్నదని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఇంటికి పంపించే ప్రక్రియలో కాంగ్రెస్ ఉన్నదన్న మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. ఇది తమతోనే సాధ్యమైతుందని ఆయన నొక్కి చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలకు పాల్పడినా తమ లక్ష్యాన్ని నీరు కార్చబోమని మరోసారి వెల్లడించారు.

Also Read : Weather Updates : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన

Exit mobile version