Congress-RJD: కుదిరిన సీట్లు సర్దుబాటు.. ఎవరెవరికి ఎన్నంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు ఇండియా కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల సీనియర్ నేతలు చర్చలు సాగిస్తున్నారు.
బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు.. సీట్ల సర్దుబాటుపై సోమవారం సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌కు 9 సీట్లు ఇచ్చే ఛాన్సుందని సమాచారం. అలాగే కాంగ్రెస్ కూడా 9 సీట్లతో అడ్జెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో హస్తం పార్టీ సర్దుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
భాగల్పూర్, ఔరంగాబాద్, ససారం, కతిహార్, కిషన్‌గంజ్, ముజఫర్‌పూర్, పాట్నా సాహిబ్, వైశాలి లాంటి నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు ఆర్జేడీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మధుబని, మోతిహారి, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్ సీట్లను కూడా కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్జేడీ మాత్రం.. కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్ల కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
గత శనివారమే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఓటింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటి వరుకు కాంగ్రెస్ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 39, రెండో విడతలో 43 మందిని వెల్లడించింది. మూడో జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది. ఇందుకోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. మూడో జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే బీఆర్ఎస్కు చెందిన పలువురు లీటర్లు హస్తం గూటికి చేరారు. వారికి లోక్‌సభ సీట్లు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!