NTV Telugu Site icon

Congress : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడడమే మా ప్రభుత్వ లక్ష్యం

Congress

Congress

ఇదిలా ఉంటే.. హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్, పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆకాంక్షలు అమలుచేయడమే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆనాడు 12 మంది ఎంపీ లు పార్లమెంట్ ను ఫుట్ ఆడుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపడడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. పదేళ్ళలో అమరవీరుల కుటుంబాలకు వంచించ బడ్డాయని, భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి సాధనలో వారందరినీ భాగస్వామ్యం చేస్తామని ఆయన తెలిపారు. గత పదేళ్ల లో కాకతీయ ఉత్సవాల వూసేలేదని, మా ప్రభుత్వం ఈ సంవత్సరం గౌరవంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మాది నియంతపాలన కాదని, ప్రజల అభీష్టం మేరకే నిర్ణయాలు అని ఆయన అన్నారు. పొడుగు ఎంత అనేది లెక్క కాదు… దమ్ముతో పోరాడి సాధించాం.. ఇవ్వాళ పాలిస్తామన్నారు. భారత ప్రధాని తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఓ చరిత్ర అని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ఎంపీ లుగా పార్లమెంట్‌లో పోరాటం చేశామని, ఉద్యమ సమయంలో మీడియా మొత్తం ఆంధ్రాదే ఉండేదరన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అప్పటి సీఎం కిరణ కుమార్ రెడ్డి తెలంగాణాకు వ్యతిరేకంగా సోనియాకు చెప్పినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వాలనేది ఎంపీలుగా సోనియాకు గట్టిగా చెప్పామని, రాష్ట్రం ఇస్తే ఎలా ఉంటుందో వివరించామన్నారు. తెలంగాణ ఇస్తే ఎంత లాభం జరుగుతుందో చాలా సార్లు చెప్పామని, సోనియా వద్ద గులాం నబీ ఆజాద్ కూడా తెలంగాణకు సపోర్ట్ చేశారన్నారు. తెలంగాణ వనరులు, ఇక్కడ ఖర్చు చేస్తున్న నిధుల గురించి కూడా వివరించామని, పార్లమెంట్ మెట్ల మీద మేం నిరాహారదీక్ష చేసినప్పుడు చాలామంది ఎంపీలు మమ్ములను చూసుకుంటూ నవ్వుకుంటూ పోయారని ఆయన తెలిపారు. అసలు తెలంగాణ సాధ్యమవుతుందా అని అనుమాన పడ్డారు. కొంతమంది ఉద్యమాన్ని అణచివేయలని చూసారు. మంత్రి పదవులు, పోస్టులు ఇస్తామని ఆశ చూపారు. కానీ కాంగ్రెస్ ఎంపీలుగా ఎవరూ లొంగకుండా ఉద్యమం చేసాం. తెలంగాణ బిల్లు పాస్ చేయించే బాధ్యత సోనియాగాంధీ మాపై పెట్టారు. జైపాల్ రెడ్డి వాయిస్ ఓటింగ్ తోనే తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే వాయిస్ ఓటింగ్ తోనే తెలంగాణ బిల్లు పాస్ అయింది. పొన్నం ప్రభాకర్ నేను లగడపాటితో ఒక దశలో గొడవకి దిగము. ప్రణముఖర్జీ కాళ్ళు మొకడానికి కూడా వెనకాడ లేదు. పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి లో మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని మధు యాష్కి అన్నారు.

అనంతరం కోదండ రామ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన ఉద్యమం సుదీర్ఘంగా సాగిందని, వరంగల్ లో తెలంగాణ విద్రోహ దినం నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా 3 వేల మంది హాజరై, ఆ తర్వాత మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున లేసిందన్నారు. ఉద్యమంలో తల్లీదండ్రులను మరిచి ఎందరో అమరులు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చారని, అనేక మంది పోరాటం తెలంగాణ కోసమే జరిగిందన్నారు. అప్పట్లో తెలంగాణ బిల్లు విషయమై సుప్రీంకోర్టు కు వెల్దామంటే.. పేరున్న ఏ లాయర్ అందుబాటులో లేదని, అందరికీ ఆంధ్రా వాళ్ళు పైసలు ఇచ్చారని ఓ లాయర్ చెప్పాడని, బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ని కలిస్తే.. వెనక్కి పోమని ఆమె మాట ఇచ్చారన్నారు కోదండరామ్‌. తెలంగాణ బిల్లు పార్లమెంట్ స్పీకర్ వద్దకు వెళ్లకుండా చించాలని చూసారు.. పెప్పర్ స్ప్రే చేశారు. ఎంతోమంది పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చింది. నేనొక్కడినే తెలంగాణ తెచ్చానని చెప్పుకునే వాళ్ళ వల్ల అడ్రెస్ లేకుండా పోయాం. పడేండ్లలో మనల్ని చెత్తబుట్టలో వేశారు. ఇన్నేళ్లు నిరంకుశ, నియంతృత్వ పాలన చేశారు. అందరి పోరాట ఫలితంగా నిరంకుశ పాలన సమాధి అయింది. మొట్టమొదటిసారి రాష్ట్ర ఆవిర్భావ సభకు ఆహ్వానించిన తృప్తి ఉంది. తెలంగాణ బతుకమ్మ కు తెలంగాణ ఉద్యమానికి సారూప్యత ఉంది. వాసన లేని పూలన్నీ బతుకమ్మ అయితే.. మాములు ప్రజలంతా కలిసి మదపుటేనుగులను మట్టి కరిపించి తెలంగాణ సాధించాం. ఇన్నేళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశాం.. కానీ ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పని చేసే అవకాశం ఇప్పుడే వచ్చింది.’ అని కోదండరామ్‌ అన్నారు.