NTV Telugu Site icon

Sonia Gandhi: వీడియో: శ్రీనగర్‌ లో సోనియా గాంధీ బోట్ రైడ్

Sonia

Sonia

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బోట్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శనివారం ఉదయం సోనియా గాంధీ జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ నగరానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆమెను ఘనంగా ఆహ్వానించాయి. ఆమెకు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీశ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు సోనియా. ఇక తరువాత సోనియా నగీన్ సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమె ఓ ఇంజన్ బోటు పై రైడ్ కు వెళ్లారు. ఆమెతో పాటు ఆమె భద్రత సిబ్బంది కూడా బోటులో ప్రయాణించారు. అంతేకాకుండా బోటులో ప్రయాణిస్తున్నప్పుడు సోనియా సరస్సు అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు సరస్సు గురించి సోనియా తన సిబ్బందిని ఏదో అడిగి తెలుసుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది.

సోనియా గాంధీ తనయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే లఢక్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్గిల్ లో  భారత జవాన్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా  సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా చైనా ఇండియా బోర్డును కూడా ఆయన పరిశీలించారు. ఇండియా భూభాగాలు ఆక్రమణకు గురైనట్లు తాను గుర్తించినట్లుగా కూడా రాహుల్ పేర్కొన్నారు. ఇక ఆ పర్యటన సందర్భంగా రాహుల్ బైక్ రైడ్ కూడా చేశారు. రాహుల్ గాంధీ నగీన్ బోర్టు హౌస్ లో ఉంటున్నారు. ఈ కారణంగానే  సోనియా నగీన్ సరసు వద్దకు వెళ్లి బోటులో ప్రయాణించి  రాహుల్ ను కలుస్తారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా వీరితో కలుస్తారు.ఈ హోటల్‌తో చాలాకాలంగా రాహుల్ కుంటుంబానికి అనుబంధం ఉందని చెబుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనేనని, కుటుంబ సభ్యులంతా కలుసుకోవడానికే పరిమితమనదిగా తెలుస్తోంది. దీనిలో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగవని తెలుస్తుంది. రైనవారి ప్రాంతంలోని హోట్‌ల్‌లో వీరంతా బస చేసే అవకాశం ఉంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఈ మధ్యే పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.