NTV Telugu Site icon

Rahul Gandhi: నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో భేటీ!

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్‌ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్‌లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్‌ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.

హనుమకొండ పర్యటన అనంతరం రాహుల్‌ గాంధీ రాత్రి 7.30కు కాజీపేట నుండి రైలులో తమిళనాడు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు రాహుల్ గాంధీని కలిసేందుకు మధ్యాహ్నం హనుమకొండకు చేరుకోనున్నారు. రాహుల్‌ గాంధీ పర్యటన దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల రియాక్షన్ కాంగ్రెస్‌ అగ్రనేత తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది.