Madhu yaskhi Goud: తెలంగాణ నినాదంతో పదేళ్లుగా కేసీఆర్ దోపిడీ పాలన జరుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ నేత ఆరెంజ్ సునీల్ రెడ్డి స్వాగత సభలో మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రస్తుతం సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని మధుయాష్కీ అన్నారు. లక్ష రుణమాఫీ కాదు.. లక్ష వడ్డీ మాఫీ అని.. సర్కారు ఇచ్చేది కేవలం వడ్డీకే సరిపోతుందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి గంజాయి వ్యాపారం చేస్తుంటే.. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత సారాయి వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు కప్పం కడుతున్నారని ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు ఆర్టీసీ ఆస్తులు కబ్జా చేశారని విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ విలీనం పచ్చి అబద్ధమని మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు.
Also Read: Wall Collapse: విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
తెలంగాణలో కేసీఆర్ నైజాం పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని హామీలు గుప్పిస్తున్నారన్నారు. ఓట్ల కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. కాంగ్రెస్ పథకాలనే బీఆర్ఎస్ కాపీ కొడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని.. విబేధాలు పక్కన పెట్టి నాయకులంతా అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సూచించారు.