Chinta Mohan: చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.. ప్రేమతో రాజకీయాలు చేయాలి.. కానీ, కక్షతో చేయొద్దని తెలిపారు.. ఆలస్యం అయినా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం సంతోషకరం అన్నారు. చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ, మళ్లీ అరెస్ట్ చేసి ఆ తప్పు చెయ్యవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాను అన్నారు. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ, వైసీపీ పాత్ర ఉందని ప్రజలు నమ్ముతున్నారన్న ఆయన.. బీజేపీ జోక్యంతో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఆరోపించారు..
Read Also: Bigg Boss Telugu 7: హ్యాట్సాఫ్ గౌతమ్..ఆ ఒక్క నిర్ణయంతో వాళ్లందరికీ నచ్చేశావ్ పో!
ఇక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారబోతున్నాయన్నారు చింతా మోహన్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆంధ్రప్రదేశ్ లో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి. ప్రేమతో రాజకీయాలు నడపాలని సూచించారు.. బైబిల్ చదివే వారికి కక్షసాధింపులు ఉండకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా లిక్కర్ పాలసీలో లోపాలు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న పాలసీలో ఇబ్బందులు ఉన్నాయని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.