సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు అని ఆరోపించాడు. బీజేపీలో ఇంకా అంటరానితనం అంటూ ముట్టు ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పడం నన్ను బాధించింది అని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఇవన్నీ భరించలేకే బీజేపీని వీడాలని నిర్ణయించుకుని బయటికి వచ్చాను అని ఆయన తెలిపారు. బీజేపీ పార్టీలో ఇప్పటికే దళితులు, మైనార్టీలపై వివక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు.
Read Also: Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పంద ఉందేమోనన్న అనుమానం కలుగుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి గీతారెడ్డి పోటీపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాజీ మంత్రి గీతారెడ్డిని రాజ్యసభకు పంపించేందుకు కృషి చేస్తామన్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో గీతారెడ్డి బాధపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదోనని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో చంద్రశేఖర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Vijay Devarakonda: ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు