Site icon NTV Telugu

Damodar Raja Narasimha: పటాన్ చెరు అభివృద్ధికి కారణం కాంగ్రెస్సే..

Damodara

Damodara

నేటితో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దాంట్లో భాగంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ ప్రచారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర నరసింహ మాట్లాడుతూ.. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధుని గెలిపించాలని ఓటర్లను కోరారు. మత పరంగా ఆలోచన చేసే పార్టీ కావాలా.. సంక్షేమం చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు సూచించారు. పటాన్ చెరు అభివృద్ధి చెందిందటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఆనాడు పేదలకు భూములు, ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

READ MORE: Kareena Kapoor : నటి కరీనా కపూర్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు జారీ.. కారణం అదేనా..?

ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను యూపీఏ (UPA) ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియగాంధీ అని తెలిపారు. పటాన్ చెరులో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాగా.. రాష్ట్రంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కపోవటంతో బయటికి వచ్చారు నీలం మధు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాసి ఓటమిపాలయ్యారు. ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ లో చేరిన ఆయనకు కాంగ్రెస్ మెదక్ ఎంపీ స్థానాన్ని కేటాయించింది. ఎలాగైనా గెలిపించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Exit mobile version